న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం వ్యవహారాల శాఖ సమాచారం సేకరిస్తోందని, ఇందుకు బాధ్యులైన వారిపై భారీ, కఠిన నిర్ణయాలు ఉంటాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కేంద్ర క్యాబినెట్ సమావేశం వివరాలను గురువారం పత్రికా విలేకరులకు వివరిస్తున్న సందర్భంగా ప్రధాని మోడీకి జరిగిన భద్రతా వైఫల్యం అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా ఈ విషయమై ఇప్పటికే కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారని ఠాకూర్ తెలిపారు. తీసుకోవలసిన చర్యలపై హోం మంత్రిత్వశాఖ కూడా ఇప్పటికే మాట్లాడిందని, సమాచారం సేకరించిన తర్వాత భారీ, కఠినమైనవి ఎటువంటి నిర్ణయాలైనా హోం శాఖ తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇటువంటి తప్పులు జరిగితే దేశ న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. ఇలా ఉండగా&గురువారం క్యాబినెట్ సమావేశంతోపాటు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ, భద్రతా వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ సమావేశాలకు ప్రధాని అధ్యక్షత వహించారు.
Anurag Thakur comments on PM Modi Security Breach