ఆ ఐదు రాష్ట్రాలలో కొవిడ్ పరిస్థితిపై ఇసి సమీక్ష
త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో కొవిడ్ పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులతో సమీక్షించింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవలసిన చర్యలను, అర్హులైన ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయవలసిన ఆవశ్యకతను ఎన్నికల సంఘం చర్చించింది. ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లో శాంతి భద్రతల పరిస్థితిని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో విడిగా సమావేశమై ఎన్నికల సంఘం చర్చించింది. ఈ ఐదు రాష్ట్రాలలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది. త్వరలోనే ఈ ఎన్నికలకు సంబంధించిన పోల్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది.
EC Review over Covid situation in 5 poll bound states