- Advertisement -
బీజింగ్ : అంతరిక్షంలో ప్రధాన వ్యూహాత్మక సంపదగా చైనా పేర్కొంటున్న స్వంత అంతరిక్ష కేంద్రం ఈ ఏడాది సిద్ధమై తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ప్రపంచానికే ఇది విహంగ వీక్షణం కానున్నదని చైనా వెల్లడించింది. ఇది సిద్ధమైతే రష్యా మాదిరి గానే చైనా కూడా స్వంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న దేశమౌతుంది. అనేక దేశాలకు సహకార ప్రాజెక్టుగా మారుతుంది. ఈ అంతరిక్ష కేంద్ర భవన నిర్మాణం ఈ ఏడాది పూర్తవుతుందని చైనా ఎయిరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ (సిఎఎస్‌టిసి) ఒక ప్రకటనలో వెల్లడించింది. రానున్న సంవత్సరాల్లో రష్యా ఐఎస్‌ఎస్ రిటైర్ అయితే చైనా అంతరిక్ష కేంద్రం ఒక్కటే మిగిలి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
- Advertisement -