- Advertisement -
అహ్మదాబాద్: రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్టా ఈ నెల 10 తేదీనుంచి జరగాల్సి ఉన్న వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌ను వాయిదా వేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజుల పాటు జరగాల్సిన ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రాంభించాల్సి ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం కోసం భారీ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సిఇఓలు పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా, దేశంలోను పెద్ద ఎత్తున ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న ఈ పరిస్థితుల్లో ఈ సదస్సును వాయిదా వేయలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
- Advertisement -