అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మొదటి పాన్ ఇండియన్ సినిమా మేజర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీని ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ ‘హృదయమా…’ అనే పాటతో మొదలుపెట్టారు. తెలుగు పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా.. మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు.
అడివి శేష్, సయీ మంజ్రేకర్‌ల మధ్య రొమాంటిక్‌గా ఈ ‘హృదయమా’ అనే పాట కొనసాగుతుంది. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన మెలోడి ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరిహద్దుల్లో మేజర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే.. అతని కోసం ఎదురుచూసే ప్రేయసి పాడుకున్నట్టుగా ఈ పాట సాగుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మేజర్ సందీప్ బాల్యాన్ని, యవ్వనాన్ని కూడా చూపించనున్నారు. ముంబయ్ దాడి, మేజర వీర మరణం వంటి సన్నివేశాలన్నీ ఇందులో చూపించబోతున్నారు. మహేష్ బాబు జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.