Saturday, December 21, 2024

నా భర్తకు న్యాయం చేయండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / ఉండవెల్లి : శ్రీరంగాపురం మం డల కేంద్రానికి చెందిన రామక్రిష్ణ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో గత 16 ఏళ్లుగా పని చే స్తున్నాడు. అయితే గత మూడు నెలలక్రితం డ్యూ టీ చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచిన వాహనాన్ని సేప్టీ మెజర్‌మెంట్స్ ఏర్పాటు చేస్తుండగా హైదరాబాదు నుంచి కర్నూలు వైపు వె ళ్లే మరో వాహనం ఢీకొనడంతో రామక్రిష్ణ తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి చేర్చి చికి త్స అందించాల్సిన తోటి సిబ్బంది, ప్రస్తుతం మె యింటెన్స్ నిర్వహిస్నున్న క్యుబ్ అనే సంస్థ యజమాన్యం నిర్లక్షంగా వ్యవహరించిందని బాధితు లు ఆవేదన చెందారు. విషయం తెలుసుకున్న కు టుంబసభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి చేర్పించి చి కిత్స అందించారు అయిన రామక్రిష్ణ కోలుకోలేదు. మూడు నెలలైనా నేటికి మంచానికే పరిమితమైయ్యాడు. భార్య లక్ష్మి తన ముగ్గురు పిల్లలతో భర్త సేవ చేస్తూ ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయా న్ని యాజమాన్యానికి తెలిపేందుకు పలుమార్లు కా ర్యాలయానికి వచ్చిన ప ట్టించుకున్న పాపాన పోలేదని, పరిహరం అడిగితే మాకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారని దీంతో శ్రీరంగాపూర్ గ్రామం గ్రామస్తులు భార్య పిల్లలతో కలిసి శుక్రవారం టోల్‌ప్లాజా వద్ద ఉన్న హైవే కార్యాలయం ముందు నిరాహరదీక్ష చేపట్టారు. ప్రాజెక్టు మేనేజర్ బాలగణేష్ రావాలని తప్పించుకు తిరుగుతున్నారని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News