వనమా రాఘవను తెలంగాణ, ఎపి సరిహద్దుల్లో కస్టడీలోకి తీసుకున్న భద్రాద్రి పోలీసులు
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఎ2గా రాఘవ
టిఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్
మనతెలంగాణ/కొత్తగూడెం: పాత పాల్వంచలో రామకృష్ణ కు టుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు వనమా రాఘవేంద్రరావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు జిల్లాలోని దమ్మపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో రాఘవ ఉన్నట్లు పోలీసులకు స మాచారం వచ్చింది. ఈలోగా రాఘవ జిల్లాకు వస్తుండగా పోలీసు లు మార్గమద్యంలోనే దమ్మపేట–, చింతలపూడి నడుమ అరెస్ట్ చేశా రు. ఈ మేరకు రాఘవేంద్రరావును మందపల్లి మీదుగా పాల్వంచ కు తరలించారు. ఇదిలా ఉండగా రాఘవను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఎస్‌పి సునీల్‌దత్ శుక్రవారం రాత్రి వెల్లడించారు.
టిఆర్‌ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
ఒక కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు వనమా రాఘవను టిఆర్‌ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్‌చార్జ్జీ నూకల నరేష్‌రెడ్డిలు ఈ నిర్ణయం తీసుకున్నారు. వనమా రాఘవపై తీసుకున్న చర్యలు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు.