Sunday, December 22, 2024

రాఘవ అరెస్ట్: ఎఎస్‌పి రోహిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రామకృష్ణ అత్మహత్య కేసులో ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వర రావు కుమారుడు రాఘవను అరెస్టు చేశామని ఎఎస్‌పి రోహిత్ తెలిపారు. ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి తాను నిప్పంటించుకున్నాడని, నిందితుల కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, డబ్బు వివాదమే కాకుండా రాఘవ తన భార్యను అడిగారని సెల్ఫీ వీడియోలో చెప్పాడన్నారు. మందలపల్లి వద్ద రాఘవను అరెస్టు చేశామన్నారు. రాఘవతో పాటు గిరీష్, మురళీలను అరెస్ట్ చేశామని, రాఘవకు మద్దతు ఇచ్చిన వారిలో మరో ఇద్దరి మీద కేసులు పెట్టామన్నారు. విచారణ కొనసాగుతోందని ఎంఎస్‌పి రోహిత్ తెలిపాడు. రాఘవ మీద మొత్తం 12 కేసులపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. నిందితులను కొత్తగూడెం కోర్టుకు తరలిస్తామన్నారు. ఎఎస్ పి కార్యాలయంలో రాఘవకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహించారు. భారీగా పోలీసులు మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News