- Advertisement -
16 మంది మృతి, 10 మందికి గాయాలు
బీజింగ్: వాయువ్య చైనాలోని చొంగ్‌కింగ్ నగరంలో శుక్రవారం ఒక ఆఫీసులోని క్యాంటీన్‌లో జరిగిన పేలుడులో 16 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. క్యాంటీనులో గ్యాసు లీకై ఈ పేలుడు జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు చోంగ్‌కింగ్ నగర అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా ప్రభుత్వ కార్యాలయానికి చెందిన క్యాంటీన్ కుప్పకూలిపోవడంతో అందులో ఉన్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఈ పేలుడు సంభవించిందిం. అర్ధరాత్రి వరకు శిథిలాల తొలగింపు జరిగింది. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
- Advertisement -