Saturday, December 21, 2024

ఆయన మరణ వార్త విని షాక్ గురయ్యా: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

Ghattamaneni ramesh babu passed away

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారని తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆయన మృతి పట్ల ప్రగాడ సానుభూతి ప్రకటించారు. రమేష్ బాబు ఇకలేరు అనే వార్త తన గుండెను కలిచి వేసిందని పరచూరి గోపాలకృష్ణ తెలిపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, పుణ్యలోక ప్రాప్తిరస్తు అంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రమేష్ బాబు మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గచ్చిబౌలిలోని ఎఐజి  ఆస్పత్రిలో కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ రమేష్ బాబు తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News