Sunday, November 24, 2024

ప్రధాని మోడీ కోసం మృత్యుంజయ హోమాలు..

- Advertisement -
- Advertisement -

Telangana BJP hold Mrityunjaya homam for PM Modi

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని రాష్ట్రవ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని రాష్ట్ర బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండల, జిల్లాల స్థాయి పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. బిజెపి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బండి సంజయ్ సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హోం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ అల్కపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో బండి సంజయ్ పాల్గొంటారు.
దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణుల నిరసన..
ప్రధాని మోడీ భద్రతా వైఫల్య ఘటనపై బిజెపి శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పంజాబ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రధాని భద్రతకు సంబంధించి పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరించిందని బిజెపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా పలు చోట్ల బిజెపి నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పంజాబ్ ప్రభుత్వమే ప్రధాని రూటుకు సంబంధించిన వివరానలు నిరసనకారులకు లీక్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు.
చర్చనీయాంశంగా మారిన వైనం…
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి విదితమే. భద్రతా లోపం కారణంగా ప్రధాని మోడీ కాన్వాయ్ పంజాబ్‌లో ఫ్లైఓవర్స్‌పై బుధవారం 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైతులు రోడ్లపై నిరసన తెలపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి పయనమయ్యారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ పంజాబ్ ప్రభుతాన్ని నివేదిక కూడా కోరింది. మరోవైపు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కూడా ఇందుకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి విదితమే.

Telangana BJP hold Mrityunjaya homam for PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News