- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎపిలో నైట్ కర్ఫ్యూ విధించింది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు నుంచి బయటపడేందుకు ముందస్తు చర్యలలో భాగంగా ఎపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలకు కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. 50 శాతం ఆక్యపెన్సీతో థీయేటర్లు, మాల్స్ నడపాలని పేర్కొంది. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని.. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం, మాస్క్ తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
AP Govt Imposes Night Curfew
- Advertisement -