Monday, December 23, 2024

మంత్రి హరీశ్‌రావుతో సినీనటుడు బాలకృష్ణ భేటీ

- Advertisement -
- Advertisement -

Bala krishna meet with Harish Rao
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావుతో ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు.అరణ్య భవన్‌లోని మంత్రి ఛాంబర్‌లో వీరు సమావేశమయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు బాలకృష్ణ మంత్రి హరీశ్ రావుతో చర్చించారు. ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను బాలకృష్ణ ఆరోగ్య శాఖ మంత్రికి వివరించారు. బసవతారకం హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుండి తగిన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో బాలకృష్ణతో పాటు బసవతారకం ఆసుపత్రిక సిఇఒ డాక్టర్ ఆర్. వి. ప్రభాకర రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News