Monday, December 23, 2024

ఫేస్ బుక్ పరిచయం… భర్తను ప్రియుడితో కలిసి చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

Wife killed husband with Lover in Mahaboob nagar

మహబూబ్ నగర్:  ఫేస్ బుక్ లో పరిచయం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య చంపిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బుద్దారంలో జరిగింది.  బుద్దారం గ్రామానికి చెందిన యువతి మాధవి, పెద్ద దర్పలి గ్రామానికి చెందిన మొద్దు వెంకటయ్యను పెళ్లి చేసుకుంది. వెంకటయ్య ఇల్లరికం వచ్చి బుద్ధారంలో ఉంటున్నాడు. ఆ దంపతులు హైదరాబాద్ ఉన్నప్పుడు మాధవికి ఫేస్ బుక్ లో నాగర్ కర్నూల్ కు చెందిన రమేష్ తో పరిచయం కావడంతో ఇద్దరు మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. రమేష్ తరుచూ బుద్ధారం వచ్చి వెళ్తుండడంతో వెంకటయ్య పలుమార్లు వాళ్లను బెదిరించాడు. భర్తను అడ్డు తొలిగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం వెంకటయ్య గాఢ నిద్రలో ఉన్న రమేష్ కు మాధవి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంకటయ్య గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. రమేష్, కుర్మయ్య అనే వ్యక్తి బైక్ పై వెంకటయ్యను తీసుకెళ్తుండగా పోలీస్ వాహనం ఎదురుగా వచ్చింది. ఎస్ఐ రవి ప్రకాశ్ అతడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా మద్యం మత్తులో కిందపడిపోయాడని సమాధానం ఇచ్చారు. ఎస్ఐకి అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడిని, ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News