బెంగళూరు: లోన్ ఇవ్వలేదని ఓ వ్యక్తి బ్యాంకుకు నిప్పు పెట్టిన సంఘటన కర్నాటక రాష్ట్రం హవేరీ జిల్లా హెడిగొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వసీం హజారస్తాబ్ ముల్లా అనే వ్యక్తి కెనరా బ్యాంకులో లోన్ కోసం పలుమార్లు అర్జీ పెట్టుకున్నాడు. అతడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడంతో దరఖాస్తును బ్యాంకు సిబ్బంది తిరస్కరించారు. ఆగ్రహంతో రగిలిపోయిన వసీం శనివారం రాత్రి కెనరా బ్యాంకు కిటికీలు పగులగొట్టి కంప్యూటర్లపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీంతో కంప్యూటర్లు, పలు డాక్యుమెంట్లు కాలిపోయాయి. రూ.12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు వసీం ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు. సామాన్యులకు లోన్ ఇవ్వడానికి నానా తిరకాసులు పెడుతున్నారని, బ్యాంకులను కొల్లగొట్టే బడాబాబులకు లోన్లు ఇస్తారు కానీ, సామాన్యులకు లోన్లు ఇవ్వడానికి సవా లక్ష రూల్స్ అడ్డు వస్తాయని సోషల్ మీడియాలో నెటిజన్లు వాపోతున్నారు. ఎగవేతదారులు బ్యాంకులను ముంచినప్పుడు పన్నుల రూపంలో సామాన్యుల నుంచి వసూలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు
లోన్ ఇవ్వలేదని బ్యాంకుకు నిప్పుపెట్టి…
- Advertisement -
- Advertisement -
- Advertisement -