వాషింగ్టన్: తాలిబన్ల పాలనలో గత ఐదు నెలలుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్ఘానిస్తాన్‌కు మానవతా సహాయంగా మరో 30.80 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ అభివృద్ధికి సంబంధించిన సంస్థ ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని అఫ్ఘాన్‌లో స్వతంత్రంగా పనిచేస్తున్న ఎన్జీఓ సంస్థలకు అందుతుందని, ఈ నిధులను అక్కడి నిరు పేద ప్రజల ఆశ్రయానికి, ఆరోగ్య సంరక్షణకు, చలికాలాన్ని తట్టుకునేందుకు అవసరమైన వస్తువులకు, అత్యవసర ఆహార సహాయానికి, పారిశుద్ధానికి సంబంధించిన సర్వీసులకు ఉపయోగించాల్సి ఉంటుందని వైట్ హౌస్ ప్రతినిధి ఎమిలీ హార్నె మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాలిబన్లు అఫ్ఘాన్‌ను చేజిక్కించుకున్న నాటి నుంచి ఆ దేశానికి విదేశీ ఆర్థిక సహాయం ఆగిపోయింది. 80 శాతం అంతర్జాతీయ సహాయంతో అక్కడి ఇదివరకటి ప్రభుత్వాలు నడిచేవి. అంతర్జాతీయ ఆర్థిక సహాయం నిలిచిపోవడంతో ఆసుపత్రులు, స్కూళ్లు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ శాఖలు సంక్షోభంలో చిక్కున్నాయి. గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు అమెరికా మానవతా సహాయంగా 78 కోట్ల డాలర్లకు పైగా సహాయాన్ని అందచేసింది.
===
అఫ్ఘాన్‌కు అమెరికా మరో 30.8 కోట్ల డాలర్ల సాయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -