వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్: పోలీసులు ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సిపి మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రమంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. పోలీసుల కోసం ప్రత్యేకంగా కరోనా బూస్టర్ డోస్ వేసేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాక్సిన్ వల్ల ఆస్పత్రిలో చేరే ప్రమాదం తప్పుతుందని అన్నారు. పోలీసులు బూస్టర్ డోస్ తీసుకున్న కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. వ్యాక్సిన్ వల్ల చాలామంది పోలీసులు కోవిడ్ నుంచి బయటపడ్డారని తెలిపారు. పోలీసులు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
పోలీసులను రక్షించుకునేందుకు రాచకొండ పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా రెండు వేవ్‌ల సమయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు కోవిడ్‌పై అవగాహన, సాయం చేశామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కోవిడ్‌పై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్‌ను పాటించాలని అన్నారు. ప్రజలు ఒమిక్రాన్‌పై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.