Monday, December 23, 2024

ఫన్ పటాకాలా నా క్యారెక్టర్

- Advertisement -
- Advertisement -

Interview with Krithi Shetty

 

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ‘బంగార్రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న యంగ్ బ్యూటీ కృతిశెట్టి మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నా పాత్ర చాలా ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంటుంది. నా క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా మంచి ఫన్ పటాకాలా ఉంటుంది. ఈ సినిమాలో నేను సర్పంచ్ రోల్‌లో కనిపిస్తాను.

ఇక ‘బంగార్రాజు’లో చేసిన ఫోక్ సాంగ్ నాకు చాలా స్పెషల్. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అయినా ఈ సినిమాలో ఈ సాంగ్‌కి కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ షూట్‌లో ఎంజాయ్ చేస్తూ ఈ సాంగ్ చేశాను. నేను ఈ సినిమాకి ఓకే చెప్పినప్పుడు నాగార్జున, చైతన్యలతో సినిమా అని కాస్త భయపడ్డాను. వాళ్ళు నాతో ఎలా ఉంటారు, ఎలా డీల్ చేస్తారో అని భయపడ్డాను. కానీ ఇద్దరూ కూడా నాకు నైస్ వెల్‌కమ్ చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరూ కూడా జెంటిల్ మెన్స్ అంతే. ప్రస్తుతం నాకు డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. ఈ విషయంలో చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ప్రస్తుతం రామ్‌తో ఒక సినిమా, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు చేస్తున్నాను”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News