Friday, December 20, 2024

వచ్చే వారం ఆప్ పంజాబ్ సిఎం అభ్యర్థి ప్రకటన

- Advertisement -
- Advertisement -

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడి

AAPs Punjab CM candidate to be announced

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును వచ్చే వారం ప్రకటిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తెలిపారు. ఇక్కడ విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రధానమంత్రి భద్రతయినా, సామాన్యుడి భద్రతయినా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్, బాదల్ కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇక ఈ దోపిడీ అంతం అయ్యే రోజులు దగ్గరపడ్డాయని, పంజాబ్‌కు మంచి రోజులు రానున్నాయని ఆయన అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిక్కు మతానికి చెందిన వ్యక్తి ఉంటారని గత ఏడాది కేజ్రీవాల్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News