- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: అతని అక్షరం మండుతున్న అగ్నికణం.. ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం. కవిత కోసమే బతికాడు. కవిత కోసమే ప్రాణాలిచ్చాడు. కవితా ప్రాణవాయువు ఆయన. కుటుంబ పోషణార్థం ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకున్నప్పటికీ తాను బతకడానికి కవిత్వాన్నే ఆహారంగా తీసుకుని ఆ కవిత్వాకలికే ఆహారమైన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. ఆయన జయంతి, వర్థంతి రెండూ జనవరి 12నే. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆయనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్‌గా చివరికంటూ సమాజం కోసమే తండ్లాడిన ప్రజా కళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్థంతి ఒకే రోజు కావడం యాదృచ్ఛికమే అయినా.. ‘మరణం నా చివరి చరణం కాదు’ అని ఆయన చేసిన ధీరోదాత్త ప్రకటన ప్రతి లక్ష సాధకుడికి స్ఫూర్తి నింపాలి’ అని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.
- Advertisement -