Thursday, November 14, 2024

నగరానికి మూడో కన్ను

- Advertisement -
- Advertisement -
CV Anand Visit Police Command Control Centre
దేశంలో మొదటి కమాండ్ కంట్రోల్
పనులను పరిశీలించిన నగర సిపి
త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్ సిపి సివి ఆనంద్

హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరానికి మూడోకన్నుగా మారనుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బుధవారం పరిశీలించారు. సింగపూర్, న్యూయార్క్‌లో మాదిరిగా దేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నారని అన్నారు. మార్చి 31వ తేదీలోపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

20 అంతస్తుల్లో నిర్మిస్తున్న భవనం గురించి ఆర్ అండ్ బి, పల్లోంజీ ప్రతినిధులు వివరించారు. భవనంలోని భద్రతా ప్రాంతాలలు, పార్కింగ్, సమావేశ మందిరాలు, ఆడిటోరియాలు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం, నగర పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు, ఎమర్జెన్సీ ఫ్లోర్లు, తెలంగాణ ముఖ్యమంత్రి, డిజిపి రూములు, డేటా సెంటర్ తదితరాలను పరిశీలించారు. పనులు పరోగతి, పెండింగ్ పనులపై పిపిటి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజ్‌క్ట్ జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తయ్యేలా ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజనీర్ విఎకే పద్మనాభరావు, కాంట్రాక్టర్ షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు, వెస్ట్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్, అడ్మిన్ డిసిపి సునీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News