Friday, December 20, 2024

సంక్రాంతి పాట విడుదల

- Advertisement -
- Advertisement -

Sankranthi song launched by Talasani Srinivas Yadav

 

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) వారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒక అద్భుతమైన పాటను రూపొందించారు. రాజ్ కిరణ్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు. ఈ పాటను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ “టిఎఫ్‌సిసి వారు ఈ సంక్రాంతికి ఒక మంచి పాటను రూపొందించారు. గీతామాధురి అద్భుతంగా పాడింది. రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ పాట ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు”అని అన్నారు. టిఎఫ్‌సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ “ప్రతి పండుగకు మా ఛాంబర్ తరపున పాటలు చేయిస్తున్నాం. ఈసారి చేసిన ఈ పాటను అందరూ విని సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.గురురాజ్‌తో పాటు టిఎఫ్‌సిసి సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News