Monday, January 20, 2025

వన్డే సిరీస్‌కు నవ్‌దీప్ సైనీ, జయంత్ యాదవ్‌ల ఎంపిక..

- Advertisement -
- Advertisement -

Navdeep Saini and Jayant selected for ODIs against SA

న్యూఢిల్లీ: యువ బౌలర్లు నవ్‌దీప్ సైనీ, జయంత్ యాదవ్‌లకు సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. కొవిడ్ బారిన పడి సిరీస్‌కు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో జయంత్‌కు స్థానం కల్పించారు. ఇక రెండో టెస్టు సందర్భంగా గాయపడిన మహ్మద్ సిరాజ్‌కు బ్యాకప్‌గా సైనీని ఎంపిక చేశారు. సిరాజ్ పూర్తిగా కోలుకోక పోవడంతో ముందు జాగ్రత్తగా సైనీకి చోటు కల్పించారు. దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండయా త్వరలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ముందుగా ఈ వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రోహిత్ గాయం కారణంగా టెస్టు సిరీస్ తోపాటు వన్డే సిరీస్ కు కూడా దూరం కావడంతో కెఎల్ రాహుల్ కు జట్టు పగ్గాలు అప్పగించారు.

Navdeep Saini and Jayant selected for ODIs against SA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News