Monday, December 23, 2024

శంకర్ పల్లిలో రైతుబంధు వారోత్సవాలు… ట్రాక్టర్ నడిపిన సబిత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గము శంకర్ పల్లి మండల కేంద్రంలో రైతు బంధు వారోత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. బిడిఎల్ చౌరస్తా నుంచి ఇంద్రన్న విగ్రహం వరకు స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతన్నలో సబితా ఇంద్రారెడ్డి ఉత్సాహం నింపారు.  ఎడ్లబండి ఎక్కి రైతులకు, ప్రజలకు అభివాదం చేస్తూ,ముఖ్యమంత్రి కెసిఆర్ తరుపున ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీని కొనసాగించారు.  శంకర్ పల్లి ప్రధాన రోడ్లలో ఇళ్ళు, దుకాణాల నుండి మంత్రికి స్థానిక ప్రజలు అభివాదం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News