Monday, December 23, 2024

పిజి మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ఈ నెల 15 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు
దరఖాస్తు కు చివరి తేదీ జనవరి 22
పిజి యాజమాన్య కోటా ప్రవేశాలకు  నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం

online applications for replacement of PG Medical Ownership Quota Seats

హైదరాబాద్: రాష్ట్రంలోని పిజి వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ – పిజి  2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పిజి డిప్లొమా/ డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
పిఆర్ఒ , కాళోజీ హెల్త్ యూనివర్సిటీచే జారీ చేయడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News