Saturday, November 23, 2024

కెటిఆర్ ను దేశ ఐటి మంత్రిగా చూడాలని వుంది: నెటిజన్

- Advertisement -
- Advertisement -

Netizens ask ktr in Twitter

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ప్రాంతీయ పార్టీలన్నింటిని ఒకతాటిపైకి తెస్తారా? అని మంత్రి కెటిఆర్‌ను నెటిజన్లు అడిగారు. భవిష్యత్ గురించి ఎవరు ఊహించగలమని కెటిఆర్ సమాధానం ఇచ్చారు. ఆస్క్ కెటిఆర్ యాస్ ట్యాగ్ తో ట్విట్టర్ లో నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానమిచ్చారు. తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫూపై ఉంటుందా అని ? మంత్రి కెటిఆర్‌కు నెటిజన్లు ప్రశ్నించారు. ఆరోగ్య శాఖ సలహా మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను ఇవ్వలేదని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లో ట్రెండంతా సమాజ్‌వాది పార్టీ వైపే ఉందన్నారు. కెటిఆర్‌ను దేశ ఐటి మంత్రిగా చూడాలని ఉందని నెటిజన్ కోరారు. తాను తెలంగాణ మంత్రిగా సంతృప్తిగా ఉన్నానని జవాబిచ్చారు. యుపి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తారా అని ప్రశ్నించడంతో సమాజ్‌వాది పార్టీతో చర్చించాక తన నిర్ణయం ప్రకటిస్తానని కెటిఆర్ చెప్పారు. 420లతో మాత్ర చర్చలకు దిగనన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News