- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖర్గే నమూనాలను బుధవారం అర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం పంపగా పాజిటివ్ గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఖర్గే కార్యదర్శి రవీంద్ర గరిమెళ్ళ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఢిల్లీలోని కార్యాలయ సిబ్బందిలో పలువురికి కూడా కరోనా సోకింది.
- Advertisement -