Monday, December 23, 2024

తిరుగు ప్రయాణానికి 3500 ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

3500 special buses for return journey Says Sajjanar

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు చాలామంది తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. సంక్రాంతి పండుగ రోజులు పూర్తికావడంతో.. సొంత గ్రామాలకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆదివారం నుంచి మళ్లీ హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వేశాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే శాఖ 110 రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సొంత గ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను విషయాన్ని టిఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News