మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల, రాజేందర్‌నగర్, దుండిగల్, పేట్‌బషీరాబాద్, పోలీస్‌స్టేషన్లలో దాదాపు 35 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషప్‌లో ఏకంగా 16 మంది పోలీసులకు కరోనా సోకింది. ఒక ఎస్‌ఐ, ఎఎస్‌ఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐతో పాటు ఏడుగురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. అలాగే జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లుకు, .పేట్‌బషీరాబాద్, దుండిగల్ పిఎస్‌లో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు కరోనా బారిన పడ్డారు. మొత్తంగా.. 35 మందికి కొవిడ్ సోకింది. వీళ్లంతా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది.
అదేవిధంగా పోలీసులకు కరోనా పాజిటివ్ రావడంతో అలర్ట్ అయిన అధికారులు మాస్క్ లేకుండా పోలీస్ స్టేషన్‌లోకి ఎవరనీ రానివ్వడంలేదు. ఫిర్యాదు దారుడు ఒక్కరే పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆంక్షలు విధించారు. కరోనా పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ జాతరల్లో ముందు జాగ్రత్తల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో జాతరల సీజన్ మొదలవుతున్న క్రమంలో ఐనవోలు మల్లికార్జున స్వామి, కొత్తకొండ, కొమురవెల్లి, మేడారం జాతరలలో బందోబస్తు నిర్వహించే పోలీసులకు ముందస్తు సూచనలు చేస్తున్నారు. జాతలకు రాష్ట్రంలోని జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో కరోనా ఆంక్షలను మరింత కఠినం చేసేందుకు పోలీసు బాసులు సమాలోచనలు చేస్తున్నారు.
16 Cops test positive for Corona in Rajendra Nagar