Saturday, December 21, 2024

100% లక్ష్యం

- Advertisement -
- Advertisement -

Minister Harish wishes doctors and healthcare workers well

కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మంత్రి హరీశ్‌రావు ట్వీట్

టీకాకు ఏడాది

వైద్యులు,హెల్త్‌కేర్ వర్కర్లకు మంత్రి హరీశ్ శుభాకాంక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్‌పై పోరాటంలో తెలంగాణ రాష్ట్రం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్యులు, హెల్త్ వర్కర్లు, సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్పూర్తితో మనం ముందుకుసాగుదామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారరు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో టీకాల పంపిణీ 5 కోట్ల డోసులు పూర్తయిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైద్యులు, హెల్త్ వర్కర్లు అంకితభావంతో చేసిన కృషి, ప్రజల సహకారం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకునేందుకు ముందుకువచ్చి రాష్ట్రాన్ని 100 శాతం వ్యాక్సినేషన్ రాష్ట్రంగా మార్చాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News