అంతర్జాతీయ మార్కెట్‌కు తెలంగాణ బ్రాండ్ చేపలు
రూ.1000కోట్లతో మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి
హైదరాబాద్ : రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం కింద నీటివనరులను అభివృద్ధి పరచటంతో మీనం.. మిల మిలలాడుతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో 4లక్షల మెట్రిక్ టన్నుల మత్స సంపద అభివృద్ధిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి విలువ సుమారు రూ.4వేల కోట్లుగా ప్రాధమిక అంచనా వేసింది. కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న ప్రధాన జలాశయాలతోపాటు , చెరువులు ,కుంటలు తదితర వాటిలో ఈ ఏడాది జల వనరులు పుష్కలంగా అందుబాటులోకొచ్చాయి. ఈ నీటి వనరుల్లో మత్సశాఖ ద్వార విడుదల చేసిన చేపలు , రొయ్యల అభివృద్ధిపై ప్రభుత్వం భారీగానే అంచనాలు పెట్టుకుంది. రూ.90కోట్ల రూపాయలు వ్యయం చేసి రాష్ట్రంలోని 28,704 జలవనరుల్లోకి 93కోట్ల చేప విత్తనం విడుదల చేసింది. అంతే కాకుండా రొయ్యెల ఉత్పత్తికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంది. గత ఏడాది ఎంపిక చేసిన 90నీటి వనరుల్లో 4.15కోట్ల రొయ్యసీడ్‌ను విడుదల చేసింది.
వీటి పెంపకం ద్వారా రూ.381కోట్ల రూపాయల విలువ చేసే 11,734మెట్రిక్ టన్నలు రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి. ఈ ఏడాది నీటి వనరుల పరిస్థితి మరింత అనుకూలంగా మారటంతో ఎంపిక చేసిన 313నీటి వనరుల్లో నీలకంఠం రకానికి చెందిన 10కోట్ల రొయ్యవిత్తనం విడుదల చేసింది. మరో రెండు మూడు నెలల్లో పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్న మత్ససంపదను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలమేరకు మత్సశాఖ యంత్రాంగం మార్కెటింగ్‌పై ఇప్పటినుంచే దృష్టి సారించింది. రాష్ట్రంలోని వినియోగదారుల ఆహారపు అవసరాలు తీర్చటంతోపాటు ,ఇతర ప్రాంతాలకు సైతం మత్ససంపదను మార్కెటింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక మత్సశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న మత్ససంపద అంతా శ్రీరాంసాగర్ , ఎల్లంపల్లి,మానేరు , నిజాంసాగర్ , మూసి జూరాల , శ్రీశైలం , నాగార్జున సాగర్ తదితర జలాశయాలనుంచే అధికంగా లభ్యత కానుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నదిలో ఏడాది పొడవునా అందుబాటులో ఉండే నీటి వవనరులు రాష్ట్రంలో మత్ససంపద అభివృద్ధికి వున్న అవకాశాలను మరింత విస్తృతపరిచింది. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న చేపలన్ని మంచినీటి చేపలే కావటంతో ఇతర ప్రాంతాల చేపలతోపోలిస్తే మరేవి ఇక్కడి చేపల రుచికి సాటిరావని మత్సశాఖ అధికారులు చెబుతున్నారు. నాణ్యత పరంగానే కాకుండా రుచి పరంగా కూడా రా్రష్ట్రంలో లభిస్తున్న మత్ససంతపదను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ బ్రాండ్ పేరుతో రాష్ట్ర మత్ససంపదను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసింది.
రూ.1000కోట్లతో మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మత్ససంపదను మార్కెటింగ్ చేసేందుకు టిఆర్‌ఎస్ సర్కారు మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రూ.1000కోట్ల ప్రాధమిక అంచనాలతో మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ది పరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం సమీకృత మత్స అభివృద్ధి పథకం , జాతీయ సహకార అభివృద్ది సంస్థలనుంచి కూడా అవసరమైన సహకారాన్ని అందిపుచ్చుకుంటోంది. నగర శివార్లలోని కొహెడ ప్రాంతంలో రూ.50కోట్ల వ్యయంతో అధునాతన చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన స్థల సేకరణకు చర్యలు చేపట్టింది. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో హోల్‌సేల్ చేపల మార్కెట్లను అభివృద్ధి పరుస్తోంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలను ఈ మార్కెట్లకు తరలించి ఇక్కడి నుంచి జిల్లాలోని మిగిలిన మార్కెట్లకు చేరవేయనుంది.
మనచేపలు మనకే..
రాష్ట్రంలోని చేపల వినియోగదారులకు అవసరమై న్ని చేపలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అవసరాలు పో గా, మిగిలిన చేపలను ఇతర ప్రాంతాలకు , ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తోంది. రాష్ట్రంలో ప్రతియేటా 3.50లక్షల మేర కు చేపల వినియోగం జరుగుతోందని అంచనా వేశారు. అందులో రాష్ట్రంలోని నీటి వనరుల నుం చి 3.37లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతోం ది. రాష్ట్రవినియోగపు అవసరాలను తీర్చేందకు ఎపి నుంచే అధికంగా ఇక్కడికి చేపల దిగుమతి జరుగుతోంది. అయితే ఈ సారి స్థానికంగానే రొ య్యలు , కొర్రమీను వంటి రకాలను ఉత్పత్తి చే స్తుండటం ద్వారా రాష్ట్ర అవసరాలు తీరటంతోపాటుగా, తెలంగాణ చేపలను ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేసేఅవకాశాలవైపు మత్సశాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారు.