సిఎం కెసిఆర్ ఆదేశాలతో వరంగల్ హైవేపై హెచ్‌ఎండిఎ సెంట్రల్ మిడెన్ గ్రీనరీ
ఇప్పటికే రాయగిరి వరకు పూర్తి.. అదనంగా 26 కి.మీ మల్టీలేయర్ ప్లాంటేషన్లు
యాదాద్రి హైవే గ్రీనరీ తరహాలో నాగ్ పూర్ హైవే
మల్టీలేయర్ ప్లాంటేషన్‌పై ఎన్‌హెచ్‌ఏఐ ఆసక్తి
హైదరాబాద్ : వరంగల్ జాతీ య రహదారి (163) వెంట ప్రస్తుతం యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్‌రోడ్స్ వరకు ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటి (హెచ్‌ఎండిఏ) ‘మల్టీలేయర్ ప్లాంటేషన్ గ్రీనరీని పెంబర్తి వరకు పొడిగించాలని పురపాలక శాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సిఎం కెసిఆర్ ఆదేశాలను అమ లు చేసేందుకు హెచ్‌ఎండిఏ సన్నాహాలు చేస్తున్నది. రాయగిరి నుంచి పెంబర్తి వరకు 26 కి. మీ మేరకు దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో మ ల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు చేపట్టేందుకు హెచ్‌ఎండిఎ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి మార్గదర్శకంలో అమలు అవుతున్న ‘తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో పురపాలక శా ఖ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), వరంగల్ జాతీయ రహదారి వెంట హెచ్‌ఎండిఏ పెంచిన ‘మల్టీలేయర్ ప్లాంటేషన్ జాతీయ స్థాయిలో అందరిని ఆకట్టుకుంటున్నది. హెచ్‌ఎండిఏ గ్రీనరీపై ఇటీవల నే షనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్. హెచ్.ఏ.ఐ) అధ్యయనం చేసింది. రాష్ట్ర ప్రభు త్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్న నేపధ్యంలో వరంగల్ రహదారి వెంట పచ్చదనం పెంపునకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
సానుకూల స్పందన రా కపోవడంతో ముఖ్యమంత్రి వరంగల్ జాతీయ రహదారి పచ్చదనం పెంపు బాధ్యతలు చేపట్టాలని మంత్రి కెటిఆర్‌కు సూచించారు. పచ్చదనం పెంపు కోసం ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు నేషనల్ హైవే సెంట్రల్ మిడెన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులు రూ.5.5 కోట్ల అంచనాలతో దాదాపు 30 కిలోమీటర్ల పొడవున మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా “మల్టీలేయర్ ప్లాంటేషన్ పూ ర్తిచేశారు. ఉత్తర్ ప్రదేశ్(ఈస్ట్) వారణాసి నేషనల్ హైవే వెంట హెచ్‌ఎండిఏ తీర్చిదిద్దిన “యాదాద్రి రూట్ మల్టీ లేయర్ ప్లాంటేషన్ మోడల్ ను నేషనల్ హైవే జాయింట్ అడ్వయిజర్(ప్లాంటేషన్) ఎ.కె.మౌర్య గత డిసెంబర్‌లో స్టడీ చేసి వెళ్లారు. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) వెంట ఉన్న మోడల్ ప్లాంటేషన్స్, సెంట్రల్ మిడె న్ ప్లాంటేషన్స్, వెహికిల్ అండర్ పాస్ (వియూపి)/ ఓవర్ బ్రిడ్జెస్ లతో పాటు ల్యాండ్ పా ర్సిల్స్ లలో పెంచిన హై డెన్సిటీ ప్లాంటేషన్స్ ను కూడా ఎ.కె.మౌర్య పరిశీలించారు.