వరల్డ్ బ్యాంక్ ప్రకటన
న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నప్పటికీ ఆ కారణంతో స్కూళ్లను మూసివేయడంలో న్యాయం లేదని, స్కూళ్లను మూసివేయడం ఆఖరి పరిష్కార మార్గం కావాలని వరల్డ్ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జైమె సావేద్ర పేర్కొన్నారు. విద్యారంగంపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందో సావేద్ర బృందం అధ్యయనం చేస్తోంది. స్కూళ్లను మళ్లీ తెరిస్తే కరోనా కేసులు పెరుగుతాయనడానికి, స్కూళ్లు సురక్షిత ప్రదేశాలు కావని అనుకోడానికి సరైన సాక్షాధారాలు లేవని సావేద్ర తెలిపారు. పిల్లలంతా వ్యా క్సిన్ పొందేవరకు వేచి ఉండాలన్న ప్రభుత్వ విధానంలో అర్ధం లేదన్నారు. రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్ మాల్స్, తెరిచే ఉంచడం, స్కూళ్లు మూసివేయించడంలో అర్ధం లేదని ఇది క్షమించరానిదని పేర్కొన్నారు. స్కూళ్లు తెరిస్తే పిల్లలకు ఆరోగ్య సమస్యలు తక్కువే ఉంటాయని, మూసివేయడం వల్ల మూల్యం ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు.