Monday, December 23, 2024

గుట్ట పీఎస్‌లో 11 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

Corona for 11 people in Chandrayangutta PS

చాంద్రాయణగుట్ట: కరోనా మహమ్మారి మరోసారి పోలీసులను వెంటాడుతుంది. ఒకటి, రెండు, మూడవ దశలలో సైతం ముం దుండి పోరాడుతున్న పోలీసులు ఎంతో మంది కరోనా బారినపడి హోం క్వారైంటన్‌కు వెళుతున్నారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పదకొండు మంది సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో ఇన్‌స్పెక్టర్ కెఎన్‌ప్రసాదవర్మ, సబ్ ఇన్‌స్పెక్టర్ గోవర్ధన్‌రెడ్డిలున్నారు. వీరు ప్రస్తుతం సెల్ఫ్ హోం క్వారంటైన్లో ఉన్నారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసు అధికారులు జీహెచ్‌ఎంసి సిబ్బంది సహాయంతో పోలీసుస్టేషన్‌లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. స్టేషన్ సిబ్బంది, వివిధ పనులపై వచ్చేవారు ఖచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. పోలీసులు కూడా తప్పనిసరిగా నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News