Sunday, December 22, 2024

మోడల్ ఇరమ్‌ఖాన్‌ది చనిపోయిందా..? చంపారా..?

- Advertisement -
- Advertisement -
Woman found dead in rented apartment At Rajendranagar
చింతల్‌మెట్ మొగల్ మెడోస్‌లో అనుమానాస్పద మృతి
 పుట్టిన రోజునే చంపారా..? లేక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందా..?
 7వ తేదీన బర్త్‌డే జరిగితే మూడు రోజు క్రితం అన్న ఫోన్ చేసినట్లు సమాచారం

రాజేంద్రనగర్ : ఓ మోడల్ అనుమానాస్పద స్థితి లో మరణించింది. ఆమె పుట్టిన రోజు వేడుకకు సంబంధించిన ఫ్లాట్లో ఏర్పాట్లు చేసి ఉండడం, ఫ్యాన్‌కు ఉరి వేసిన మృతదేహం వేలాడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మోడలింగ్‌పై మోజు తో కన్నవారికి దూరంగా ఉంటున్న మృతురాలు ఆత్మహత్యకు పాల్పడిందా..? లేక గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను చంపి ఆ విధంగా చిత్రీకరించి ఉంటారా..? అన్న అనుమానాలకు పోస్టుమార్టం రిపోర్టు నిగ్గు తేల్చాల్సి ఉంటుందనిపిస్తోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ మెంట్ వద్ద తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన వివరాలు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విజయ్ నగర్ కాలనీకి చెందిన ఇరమ్ ఖాన్ వృత్తిరీత్యా మోడలింగ్ చేస్తుంటుంది. ఈ వ్యాపకంపై కన్నవారికి ఇష్టం లేకపోవడంతో తల్లితో గొడవ పడి బయటకు వచ్చేసింది.

కొంత కాలంగా చింతల్‌మెట్‌లో మొగల్‌మెడోస్ అపార్టుమెంట్ 204లో నివాసం ఉంటోంది. మో డలింగ్‌తో పాటు బ్యూటీషియన్ పై కూడా పట్టు ఉండడంతో జీవనం సాఫిగానే ఆమె కొనసాగిస్తున్నట్లు తెలిసింది. కాగా, వారం రోజుల క్రితం ఇరమ్‌ఖాన్ పుట్టిన రోజు ఉండడంతో స్నేహితులతో కలసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నట్లు ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో చేసిన ఏర్పాట్లు రుజువు చేస్తున్నాయి. కేక్ కటింగ్ వరకు బాగానే జరినట్లుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే మిస్టరీ. కాగా, ఆదివారం ఇరమ్‌ఖాన్ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపార్ట్ మెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు ఇరమ్‌ఖార్ ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ కుళ్లిన మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్‌ను రప్పించి వివరాలు సేకరించి, మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

చనిపోయిందా..? చంపారా..?

మోడల్ ఇరమ్ ఖాన్ మరణం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతున్న దృశ్యంలో ఆమె పాదాలు బెడ్‌కు తగిలి ఉండడం, కాళ్లు కొంత ముడిచినట్లుగా కనిపించడం ఆత్మహత్య కాకాపోవచ్చన్న అనుమానాలకు తావిస్తోంది. స్వయంగా మోడలింగ్‌లో రాణిస్తూ ఎంచుకున్న విధంగా జీవనం సాగిస్తున్న ఇరమ్‌ఖాన్ అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కనిపించడంలేదని తెలుస్తోంది.

పుట్టిన రోజునే చంపారా..?

ఇరమ్‌ఖాన్ పుట్టిన రోజు వేడుకకు భారీ ఎత్తున బెలూన్స్ కట్టి, ఆ ప్రాంతం అంతా ఆలకరించి ఉండడం చూస్తుంటే చాలా మంది ఆ వేడుకకు హాజరై ఉంటారని తెలుస్తోంది. కానీ, అంత బాగా పుట్టిన రోజు జరుపుకున్న ఇరమ్‌ఖాన్ ఆ తరువాత తనువు చాలించాలనుకోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోడలింగ్, బ్యూటీషిన్‌గా కొనసాగుతున్న మృతురాలికి ఇతర వ్యాపకాలు ఏమైనా ఉండి ఉంటాయా..? ఆ వ్యాపకాలే ఆమె ప్రాణాలు తీయడానికి కారణమై ఉంటాయన్న కోణంలో పోలీసులు ఆరా తీయాల్సింది.

మూడు రోజు క్రితం అన్నకు ఫోన్ చేసిందా..?

ఇదిలా ఉండగా ఇరమ్‌ఖాన్ పుట్టిన రోజు వేడుక ఈనెల 7వ తేదీన జరిగినట్లు పోలీసులకు స్థానికులు తెలిపినట్లు తెలిసింది. అయితే గత మూడు రోజుల క్రితం మృతురాలు తన అన్నకు ఫోన్ చేసి తనకు జీవితం పై విరక్తిగా ఉందని, ఇక బతకను అని చెప్పినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసినట్లు సమాచారం. అయితే ఏడవ తేదీన జరిగిన పుట్టిన రోజుకు సంబంధించిన ఏర్పాట్లు వారం రోజులు దాటినా శుభ్రం చేసి ఉండకపోవడం ఇరమ్‌ఖాన్‌ది ఆత్మహత్య కాదు, హత్యే అనే కోణంలో అనుమానాలను కలిగిస్తోంది. దీని పై పోలీలు వివిధ కోణాల్లోదర్యాప్తు చేస్తే తప్ప అసలు విషయం బయటకు రాదనేది నగ్న సత్యంగా కనిపింస్తోంది. పోస్టుమార్టం నివేధిక అసలు ఇరమ్‌ఖాన్ ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య చేయపబడిందా అన్న సత్యాన్ని చాటనుందని స్థానికులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News