Friday, November 1, 2024

ఘనంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -
Komuravelli Mallanna Jatara 2022
మొదటి ఆదివారం పట్నం వారంతో ప్రారంభమైన మల్లికార్జున స్వామి వేడుకలు
ఆంక్షల నడుమ భారీగానే వచ్చిన భక్తులు
ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

కొమురవెల్లి : రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయం మల్లన్న క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ అధికారులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆదివారం ప్రారంభమైన పట్నం వారం స్వామి వారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. వేకువజామునే కోనేటిలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గంగరేణిచెట్టు వద్ద బోనాలు చేసి పట్నా లు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారుగా 60వేల పై చిలుకు భక్తులు దర్శనం చేసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు. ఆలయం మొత్తం పసుపు బండారితో శివసత్తుల పూనకాలతో ఓగ్గు, డోలు వాయిద్యాలతో మార్మోగాయి. మల్లన్న సన్నిధి మొత్తం పసుపుతో నిండిపోయింది. మమ్ములను కాపాడమని భక్తులు స్వామివారిని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇఒ బాలాజీ, ఆలయ చైర్మన్ భిక్షపతి పాలక మండలి సభ్యులు చింతల పర్శరాములు, బొంగు నాగిరెడ్డి, పోతుగంటి కొమురెల్లి, కొంగరిగిరిధర్, శ్రీనివాస్, అమర్ తగిన ఏర్పాట్లు చేశారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారికే దర్శనం

రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ నమోదు కావడంతో ఆలయ అధికారులు వ్యాక్సిన్ తీసుకున్న వారికే దర్శనానికి అనుమతి ఇచ్చారు. భక్తులు కూడా మాస్కులు ధరించి బౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకున్నారు.

పోలీసుల బందోబస్తు

సిద్దిపేట సిపి శ్వేత అదేశాల మేరకు హుస్నాబాద్ ఎసిపి సతీష్, సిఐ శ్రీనివాస్‌రెడ్డి, కొమురవెల్లి ఎస్‌ఐ చంద్రమోహన్, చేర్యాల ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొమురవెల్లికి వచ్చే వాహనాలను పార్కింగ్ స్థలంలో నిలిపి ట్రాఫిక్ సమస్య రాకుండా చూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News