- Advertisement -
భువనేశ్వర్: ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత శాంతిదేవి ఒడిషలోని రాయగడలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. 88 ఏళ్ల శాంతిదేవి తన గునుపూర్ ఆశ్రమంలో ఉండగా ఛాతీ నొప్పి రావడంతో స్పృహకోల్పోయారు. వెంటనే ఆమెను రాయగడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం తెలిపారు. శాంతిదేవి మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, ఒడిష గవర్నర్ గణేషి లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. 2021 జనవరి 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. శాంతిదేవికి ఒక కుమారుడు ఉన్నారు.
- Advertisement -