Sunday, September 22, 2024

కరోనా టీకా పంపిణీ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Collector visiting Corona vaccine distribution centers
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలోని గగన్‌మహల్, డిబిఆర్ మిల్స్ యుపిహెచ్‌సీలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించి వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం కేంద్రాలలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 60 సంవత్సరాలు నిండిన వారికి, 15నుంచి 18 ఏళ్ల లోపు వారికి ఈకేంద్రాల్లో టీకా వేస్తున్నట్లు అధికారులకు కలెక్టర్‌కు వివరించారు. ఏమైనా సమస్యలు ఉంటా నాదృష్టికి తీసుకరావాలసిందిగా కోరారు. కేంద్రాల్లో జరుగుతున్న కరోనా టెస్టులు వివరాలు, రోజుకు ఎంతమంది టీకాలు తీసుకుంటున్నారు వివరాలు సేకరించారు.

కరోనా పరీక్షలు చేసినప్పుడు ఎంతమందికి పాజిటివ్ వస్తుందని, వచ్చిన వారికి ఎలాంటి చికిత్స చేస్తున్నారని అడిగారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బూస్టర్ డోసుపై అధికారులు ప్రజలు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడుతూ బంధువులు, స్నేహితులను టీకా వేయించుకునేలా చైతన్య పరచాలన్నారు. ఈకార్యక్రమంలో డా. పద్మజ ఎస్‌పిహెచ్‌ఓ కింగ్‌కోఠి, డా. దీప్తి మెడికల్ ఆఫీసర్, బొగ్గులకుంట యుపిహెచ్‌సి డా. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News