Monday, December 23, 2024

రైలు నుంచి కిందపడి జూనియర్ ఆర్టిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

Junior artist dead in Shadnagar

రంగారెడ్డి: రైలు ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడి జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జ్యోతిరెడ్డి(28) అనే యువతి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో ఉద్యోగిగా పని చేయడంతో పాటు జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. సంక్రాంతి పండుగ నిమిత్తం సొంతూరు కడప జిల్లాకు వెళ్లి హైదరాబాద్‌కు వస్తుంది. కాచిగూడ స్టేషన్ వచ్చిందనుకొని షాద్‌నగర్ లో దిగింది. అంది షాద్‌నగర్ అని తెలుసుకొని కదులుతున్న రైలు ఎక్కబోయి కిందిపడడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని జూనియర్ ఆర్టిస్టులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News