Monday, December 23, 2024

పుల్లూరులో రూ.2 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

RS 2 Crores development works launched by Harish Rao

సిద్దిపేట: పుల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభోత్సవం చేశారు. పుల్లూరు గ్రామంలో రూ.18 లక్షలతో నిర్మించిన ఎస్సి కమ్యూనిటీ హాల్, 60వేల లీటర్ల సామర్థ్యం గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, దేవాదాయశాఖ నిధులు రూ.25 లక్షలతో మున్నూరుకాపు సంఘం భవనం, రూ.20 లక్షలతో గంగపుత్ర సంఘ భవనం, రూ.16 లక్షలతో దుర్గమ్మ ఆలయ పునరుద్ధరణ పనులు, రూ.45 లక్షలతో గ్రామంలో సిసి రోడ్ల పునరుద్ధరణ పనులు, రూ.5 లక్షలతో ఓపెన్ జిమ్, రూ.12.5 లక్షలతో డంపింగ్ షెడ్, రూ.17 లక్షల 18 వేలతో నిర్మించిన గొర్రెలకు 25 షెడ్లు, రూ.32 లక్షలతో స్మశాన వాటిక, రూ.23 లక్షలతో క్లస్టర్ రైతు వేదికను ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News