Monday, December 23, 2024

జైల్లో విటులు.. బయట నిర్వాహకులు

- Advertisement -
- Advertisement -

వ్యభిచార కేసుల్లో జరుగుతున్న తంతు
పోలీసులకు చిక్కని నిర్వాహకులు
పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్షం
కిందిస్థాయి సిబ్బంది
సహకరించడంతోనే
తప్పించుకున్నట్లు
ఆరోపణలు
మసాజ్ సెంటర్
నిర్వాహకురాలిని వదిలేసిన
పోలీసులు

Main candidate escaped in brothel house

మన తెలంగాణ/సిటిబ్యూరో: మానవ అక్రమ రవాణ, యువతులు, మహిళలను వ్యభిచారంలోకి దింపే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలనే ప్రభుత్వ నిర్ణయం అమ లు కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వ్యభిచార ముఠాల ఆటకట్టించి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ విభాగాలను ఏర్పాటు చేశారు. వీరు వ్యభిచార ం చేస్తున్న కేంద్రాలపై దాడులు చేస్తున్న పోలీసులు బాధి త యువతులను రక్షించి, విటులను జైలుకు పంపుతున్నా రు. ఇది చూస్తే అందరికి బాగానే ఉన్నట్లు కన్పిస్తోంది. కా ని వ్యభిచారం నిర్వహిస్తున్న అసలు నిందితుల పట్ల ప్రత్యే క విభాగాల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల పలువు రు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మూ డు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసుల్లో అస లు నిర్వాహకులు పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ఏమాత్రం ఆసక్తి చూపడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

దీంతో అసలు నేరస్థులు జైలుకు వెళ్లకుండా యథేచ్చగా బయట తిరుగుతు వేరే ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీరి కార్యకలాపా లు ఎక్కడా ఆగడంలేదు, కేవలం బాధిత యువతులు, ప్రాంతం మాత్రమే మారుతోంది. హైదరాబాద్‌కు ఉన్న పేరును దెబ్బతీసే విధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన కొం దరు నిర్వాహకులు వివిధ ప్రాంతాలను అడ్డాగా చేసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందు లు ఎదుర్కొంటున్న యువతులను టార్గెట్‌గా చేసుకుని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నగరానికి తీసుకుని వచ్చి వ్య భిచారం చేయిస్తున్నారు. యువతులకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో వారు ఎవరికీ చెప్పడంలేదు. కొన్ని సమయాల్లో పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో ఎహెచ్‌టియూ విభాగం, స్థానిక పోలీసులు కలిసి దాడులు చేసి యువతులను రక్షిస్తూ విటులను జైలుకు పంపిస్తున్నారు. కానీ నిర్వాహకులు మాత్రం చట్ట ంలోని లోసుగులను ఆసరాగా చేసుకుని పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.

నిర్వాహకులు బయటే…

మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన పిటా కేసుల్లో చాలా వరకు నిర్వాహకులు అరెస్టు కాగా, కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో మాత్రం నిర్వాహకులు బయట తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు పరోక్షంగా వ్యభిచార నిర్వాహకులకు సహకరించడంవల్లే బయట తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యభిచారం నిర్వహిస్తున్న కేం ద్రాలపై పోలీసులు దాడులు చేసినప్పుడు నిర్వాహకులు అక్కడే ఉన్నా ప్రత్యేక విభాగం పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకుండా కొందరు పోలీసు అధికారులు వ్యవహరించడంపై అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుం డా వ్యభిచార నిర్వాహకులను కేసు దర్యాప్తు కోసం స్థాని క పోలీసులకు అప్పగించినా వారు కూడా అసలు నిందితులను పట్టుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు వ్యభిచార నిర్వాహకులపై పిడి యాక్ట్ పెట్టి ఉక్కు పాదం మోపాలని ఆదేశించినా అమలు కావడంలేదు.

వ్యభిచార కేంద్రాలపై దాడులు చేసే వరకు ఆస క్తి చూపుతున్న పోలీసులు తర్వాత దర్యాప్తు,ప్రధాన నిందితులను అరెస్టు చేయడంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ వంటి ఆ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేం ద్రంపై యంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు దాడులు చేశారు.
నలుగురు బాధితులను రక్షించి, ము గ్గురు విటులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మసాజ్ సెంటర్ నిర్వాహకురాలు అక్కడే ఉండడంతో ఆమె తమతో వ్యభిచారం చేయిస్తోందని బాధితులు పోలీసులకు చెప్పారు. అయినా కూడా పోలీసులు ఆమె తెలియదన్నట్లు వ్యవహరించారు. ఎన్నో ఏళ్లుగా సదరు మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్నా కూడా పోలీసులు అరెస్టు చేయడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు సహకరించడం వల్లే మహిళ తన వ్యాపారాన్ని నిర్వహిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News