హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రమంతటా ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఏర్పట్లు చేశాం. 76 ఆసుపత్రిల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. 340 మెట్రిక టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాం. రాబోయే కాలంలో 500 మెట్రిక్ టన్నులకు పెంచుకుంటాం. వ్యాక్సినేషన్ లో కూడా తెలంగాణ ముందంజలో ఉంది. ఏ జిల్లాలో తక్కువ వ్యాక్సినేషన్ ఉందో వాటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం. హోం ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. బస్తీదావాఖాల్లో కూడా పరీక్షలు నిర్వహించాలని, పాజిటీవ్ వచ్చిన వారికి హోం ఐసోలేషన్ కిట్స్ వెంటవెంటనే అందించాలని అధికారులను అదేశించాం. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆదివారం కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు బస్తీ దావాఖానాలు పనిచేయాలని సూచించాం. ప్రజలు ఆస్పత్రుల వద్దకు వెళ్లకుండా.. ప్రజల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి వైద్యం అందిస్తుంది. పరీక్షల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.. ఎంతమంది వస్తే అంతమందికి పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది” అని పేర్కొన్నారు.
Harish Rao Press Meet on Corona Situations