Monday, December 23, 2024

తిరుపతిలో భర్త తలతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న భార్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ మహిళతో చనువుగా ఉంటున్నాడని భర్తను చంపి తలతో పోలీస్ స్టేషన్‌లో భార్య లొంగిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలోని రేణిగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పోలీస్ లైన్ వీధిలో రవిచంద్ర సూరి(53), వసుంధర నివసిస్తున్నారు. రవిచంద్ర మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం వచ్చింది. దీంతో తనని, తన కుమారుడిని రోడ్డున పడేస్తారేమోనని ఆమె ఆందోళన చెందింది. దీంతో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. గురువారం ఉదయం సూరి టిఫిన్ చేస్తుండగా కత్తితో పొడిచింది. అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసి తలను బ్యాగ్‌లో వేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మొండాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్‌లో వసుంధర వింతగా ప్రవర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News