Friday, December 20, 2024

చెట్టు నరికివేత.. రూ.20వేలు ఫైన్

- Advertisement -
- Advertisement -

Fined Rs 20000 for cutting down 2 Trees at Ambedkar Colony

సిద్దిపేట: హరితహారంలో భాగంగా నాటిన రెండు చెట్లను నరికివేయడంతో అధికారులు రూ.20వేల జరిమానా విధించారు. ఈ సంఘటన సిద్దిపేట పట్టణంలో అంబేద్కర్ నగర్ లో చోటుచేసుకుంది. అంబేద్కర్ నగర్ లో ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ సెంటర్ వారు.. సర్వీసింగ్ సెంటర్ ముందున్న రెండు చెట్లను నరికివేసిన విషయం మున్సిపల్ కమీషనర్ రవీందర్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. వెంటనే సంబంధిత ప్రాంతానికి వెళ్లి సదరు దుకాణదారులను పిలిచి పట్టణమంతా పచ్చదనం ఉండేలా  మంత్రి తన్నీరు హరీష్ రావు, మున్సిపల్ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని దుకాణం ముందు పెరిగిన ఇంత పెద్ద చెట్టును తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు చెట్లకు గాను చెట్టుకు రూ.10,000 చొప్పున రూ.20,000 జరిమానా విధించాలని, చెట్టుకు 20 చెట్ల చొప్పున మొత్తం 40 చెట్లు వారితో పట్టణంలో ఎక్కడైనా నాటించాలని అధికారులను ఆదేశించారు.

Fined Rs 20000 for cutting down 2 Trees at Ambedkar Colony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News