Monday, January 20, 2025

కోతుల సంతాన నిరోధక కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

Control of monkeys requires family planning treatment

రైతులకు, ప్రజలకు వానరాల బెడద తగ్గించే చర్యలు
అటవీ, వ్యవసాయ అధికారులతో మంత్రులు ఇంద్రకరణ్, సింగిరెడ్డి సమీక్షా సమావేశం

మనతెలంగాణ/ హైదరాబాద్ : పంటల వైవిద్యీకరణకు కోతుల బెడద నివారించాల్సిన అవసరం ఉందని, నియంత్రణకు గతంలోనే కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కోతుల బెడద నివారణపై అరణ్యభవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్‌రెడ్డి, అటవీ, వెటర్నరీ, వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులతో వారు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఎనిమిది మంది అధికారుల కమిటీతో మంత్రుల సమావేశమయ్యారు. కోతులతో సామాన్య ప్రజానీకం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య పరిష్కారానికి చర్యలు, కోతుల పునరావాస కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల కోతులు ఉన్నట్లు అంచనా ఉందన్నారు.

కోతుల నియంత్రణకు కుటుంబ నియంత్రణ చికిత్స అవసరమని, ప్రతి జిల్లాలో కోతుల సంతాన నిరోధక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కోతుల కుటుంబ నియంత్రణ చికిత్సల నిర్వహణకు అవకాశాల పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పంటలకు కోతుల బెడద తీవ్రంగా ఉంది. రైతులను ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేతి కొచ్చిన పంటలు కోతుల పాలవుతుంటే రైతులు మనోవేదనకు గురవుతున్నారు. కోతుల నియంత్రణకు చట్ట పరిధిలో ఉండే ఇతర అవకాశాలను పరిశీలించాలని అధికారులకు వారు సూచించారు. పంటల వైవిద్యీకరణకు కోతుల బెడద నివారించాల్సిన అవసరం ఉందని, కోతుల నియంత్రణకు గతంలోనే కమిటీ ఏర్పాటు .. ఇప్పటికే పలు అంశాలపై అధ్యయనం చేశామని మంత్రులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అటవీ అధికారులకు వారు సూచించారు. పంటల వైవిద్యీకరణకు కోతుల బెడద నివారించాల్సిన అవసరం ఉందన్నారు.

అడవులు, జాతీయ రహదారులపై పండ్ల మొక్కలను ప్రతి సీజన్‌కు అందుబాటులో ఉండేలా పెంచాలి. పల్లెప్రకృతి వనాలలో పండ్ల మొక్కలు తప్పనిసరిగా పెంచాలని మంత్రులు సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలలో వేసిన పండ్ల మొక్కలు అప్పుడే ఫలితాలనిస్తున్నాయన్నారు. రైతులకు కోతుల బెడదను తప్పించాలన్న విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కోతుల బెడద నివారించాలంటే కోతుల గణన, వాటి వల్ల రైతులకు జరుగుతున్న నష్టం అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో కోతుల బెడద నివారణ కమిటీ కన్వీనర్ రఘునందన్‌రావు, పిసిసిఎఫ్ (సోషల్ ఫారేస్ట్రీ) ఆర్.యం. దొబ్రియల్, సీఎఫ్ హైదరాబాద్ ఎం, జే అక్బర్, అటవీశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News