- Advertisement -
స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన భారీ సినిమా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బిగ్ మూవీస్ చేయబోతున్నాడు. ఇద్దరు పర్ఫెక్ట్ దర్శకులతో తారక్ సినిమాలు చేయబోతున్నాడు. మొదటగా బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తన 30వ ప్రాజెక్ట్‌ని చేయనున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాల మేరకు ఈ సినిమాను సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కించేందుకు కొరటాల శివ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఈ సినిమా హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది త్వరలో తెలియరానున్నది.
- Advertisement -