Friday, January 3, 2025

తగ్గుముఖం పడుతున్న ఆర్-వాల్యూ

- Advertisement -
- Advertisement -

India's R-value further reduces to 1.57

మద్రాస్ ఐఐటి పరిశోధకుల వెల్లడి

చెన్నై : ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమణ తీరును తెలియజేసే ఆర్ వాల్యూ (రీప్రొడక్షన్ నంబర్) తగ్గుముఖం పడుతున్నట్టు మద్రాస్ ఐఐటి పరిశోధకులు వెల్లడించారు. వైరస్ సోకిన వ్యక్తి తిరిగి ఎంతమందికి వ్యాప్తి చేస్తారనేది ఆర్‌వాల్యూగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఈ విలువ 1 ఉంటే కరోనా సోకిన వ్యక్తి మరొకరికి అంటిస్తారన్న మాట. సాధారణంగా ఆర్ వాల్యూ ఒకటి దాటితే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే. అంటే 100 మందికి పైగా వైరస్‌ను వ్యాప్తి చేస్తారు. ఆర్ వాల్యూ పెరిగే కొద్దీ ఈ విధంగా వైరస్ గొలుసుకట్టు వ్యాప్తి విస్తరిస్తుంది. జనవరి 1424 మధ్య ఆర్‌వాల్యూ 1.57 గా నమోదైనట్టు ఐఐటి పరిశోధకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో 14 రోజుల్లో అంటే ఫిబ్రవరి 6 నాటికి దేశంలో కేసుల సంఖ్య తారాస్థాయికి చేరుకుంటుందని పరిశోధకులు వెల్లడించారు.

జనవరి 7 13 మధ్య ఆర్‌వాల్యూ 2.2 గా. 16 తేదీల మధ్య 4 గా, డిసెంబరు 25 31 మధ్య 2.9 గా ఉన్నట్టు తెలిపారు. క్రమంగా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. ఐఐటి మద్రాస్‌కు చెందిన ఆచార్యనీలేశ్ ఎస్. ఉపాధ్యాయ్ నేతృత్వం లోని గణిత విభాగం ఈ ప్రాథమిక విశ్లేషణను అందించింది. ఈ పరిశోధన వివరాల ప్రకారం ముంబైలో ఆర్‌వాల్యూ 0.67గా, ఢిల్లీలో 0.98గా. చెన్నైలో 1.2 గా , కోల్‌కతాలో 0.56గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ముంబై, కోల్‌కతాలో కొవిడ్ బిజృంభణ ఇప్పటికే తారాస్థాయికి చేరుకుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ జయంత్ ఝా తెలిపారు. ఢిల్లీ, చెన్నైలో మాత్రం ఇంకా భారీస్థాయిలో కేసులు రావాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News