Monday, December 23, 2024

కరోనా మృతుల సంఖ్య 4,89,409కు చేరిక

- Advertisement -
- Advertisement -
Covid-19 death toll rises to 489409
క్రియాశీల కేసులు 21,87,205

న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 3,33,533 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,92,37,264 కు చేరింది. అయితే శనివారంతో పోలిస్తే స్వల్పంగా కేసులు తగ్గినా వరుసగా నాలుగో రోజు కూడా మూడు లక్షలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయని ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 17.22 శాతం నుంచి 17.78 శాతం పెరిగింది. దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 21,87,205 కు పెరిగింది. ఈ కేసుల రేటు 5.57 శాతానికి పెరిగింది. తాజాగా 525 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 4,89,409 కు పెరిగింది.

మరణాల రేటు 1.25 శాతంగా నమోదైంది. కొత్తగా మరో 2,59,168 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం 3,65,60,650 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 93.18 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివ్ రేటు 17.78 శాతం వరకు నమోదు కాగా, వీక్లీ పాజిటివ్ రేటు 16.87 శాతంగా ఉంది. శనివారం దేశ వ్యాప్తంగా 71.10 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 1,61,92,84,270 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో 4,15,77,103 మందికి పైగా టీకా తొలి డోసు తీసుకున్నారు. అలాగే మొత్తం 80,10,256 మందికి ప్రికాషనరీ డోసులు పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News