Monday, December 23, 2024

పెళ్లి వాయిదా వేసుకున్న ప్రధానమంత్రి

- Advertisement -
- Advertisement -

New Zealand PM cancels her wedding

వెల్లింగ్టన్ : ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి జసిందా అర్డర్న్ పెళ్లి వాయిదా వేసుకున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో తన వివాహ కార్యమ్రాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. క్లార్క్ గేఫోర్డ్, జెసిందా ఇద్దరు స్నేహితులు. ఇప్పటికే జెసిందా, గేఫోర్డ్ కరోనా కారణంగా పలుమార్లు తమ పెళ్లిని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా ఆంక్షల నేపథ్యంలో మరోసారి తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నామని వెల్లడించారు. ప్రధాని జెసిందా ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందని, ప్రజలతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాతో ఇబ్బందులను అనుభవిస్తున్నవారిలో తాను కూడా చేరాన్ని జెసిందా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News