- Advertisement -
సంగారెడ్డి: కుటుంబం ఆత్మహత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల అమీన్‌పూర్ లోని వందనపురి కాలనీలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కరోనాతో శ్రీకాంత్ నాలుగు నెలల నుంచి ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉన్నారు. పలుమార్లు ఫైనాన్షియర్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. డబ్బులు లేవని ఫైనాన్షియర్స్‌కు శ్రీకాంత్ మెయిల్ చేసినట్లు గుర్తించారు. ఎలా చనిపోవాలని నెల ముందు నుంచి నెట్‌లో వెతికినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -